![]() |
![]() |

బుల్లితెర మీద శ్రీవాణి, విక్రమాదిత్య జోడి ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. వీళ్ళు సీరియల్స్ లో నటిస్తూ మరో వైపు యూట్యూబ్ ఛానెల్స్ ని రన్ చేస్తూ ఉంటారు. వీళ్ళ అమ్మాయి రాజనందిని కూడా చదువుకుంటూ ఢీ డాన్స్ షోలో కంటెస్టెంట్ గా చేస్తోంది. రీసెంట్ గా శ్రీవాణి ఒక ఇంటర్వ్యూలో కుటుంబ కలహాల గురించి చెప్పుకొచ్చింది. "నేను తమిళ్ సీరియల్ చేస్తున్నాను ఆ టైములో. మా అన్నయ్య చనిపోయినప్పుడు నేను చూసి కార్యక్రమం అయ్యేంత వరకు ఉండకుండా నేను డైలీ షూటింగ్ కాబట్టి నేను వెళ్ళిపోయాను. ఇక తర్వాత వెళ్లి పలకరించిన పాపానికి పెద్ద రాద్ధాంతం అయ్యింది.
అప్పటికే అంటే 2014 లోనే మా ఇల్లు కూలిపోయింది. 2016 లో నేను బుల్డోజర్ తీసుకెళ్లి వాళ్ళ ఇల్లు కూలగొట్టి మా వదిన సామాన్లు బయట పారేసాను అని వరకట్నం వేధింపులు అంటూ మా ఫామిలీ కేసు పెట్టేసింది. నేను ఇండస్ట్రీలో ఉంటూ ప్రెస్ వాళ్ళు ఉంటారని తెలిసి నేను షోస్ చేసుకుంటూ అంత ఫ్యూలిష్ గా ఎలా బిహేవ్ చేస్తాను అని ఎలా అనుకుంటారు. ఒకటి సన్ టీవీ సీరియల్ ఒకటి జీ తమిళ్ సీరియల్ చేస్తున్నా. ఏ డేట్ లో ఎక్కడ ఉంటానో నాకే తెలీదు. అలాంటిది నేను వెళ్లి హరాస్ చేయడమేంటో తెలీదు ఆన్ స్క్రీన్ ఉన్నాను కాబట్టి నా పేరు బాగా వినిపించింది. నాకు మా వదినతో అంత ర్యాపొ లేదు. వాళ్ళ పెళ్లి అయ్యే టైంకి నాకు ఏడేళ్లు. నేను పుట్టింది పెరిగింది అంతా సిటీలోనే. కొట్టింది, మ్యాగీ స్పూన్ తో కాల్చింది, బియ్యం బస్తాలు తీసుకెళ్ళిపోయింది అంటూ రకరకాలుగా నా మీద న్యూస్ వచ్చింది. ఇలా కూడా రాస్తారా అనిపించింది. నేను తప్పు చేసినదాన్నే ఐతే మా ఫామిలీ మెంబర్స్ మా అత్తగారి వాళ్ళ ఫామిలీ మెంబర్స్ అంతా మాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు. న్యూస్ చానెల్స్ అన్నిటిలో ఈ వార్తలు చూసాక అప్పటినుంచే నాకు న్యూస్ ఛానెల్స్ మీద ఇంటరెస్ట్ పోయింది. ఇక కేసు ఇంకా కంటిన్యూ అవుతోంది.శిక్ష ఆమెకు పడుతుందా, మాకు పడుతుందా, కేసు కొట్టేస్తారా అసలు ఏమవుతుందో మళ్ళీ అప్పుడు చెప్తా. " అంటూ శ్రీవాణి చెప్పుకొచ్చింది.
![]() |
![]() |